నిహారిక ఇన్స్టా పోస్ట్‌ వైరల్.. నెటిజన్స్ ట్రోలింగ్

నిహారిక ఇన్స్టా పోస్ట్‌ వైరల్.. నెటిజన్స్ ట్రోలింగ్

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసెంట్ వెబ్ సిరీస్ తీస్తూ, ఇతర దేశాల్లో ట్రిప్స్ కు వెళ్తూ..లైఫ్ ఎంజాయ్ చేసే ప్రయత్నంలో ఉంది.

లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన ఫొటోలో..ఆరెంజ్ కలర్ శారీలో పద్దతిగా ఉన్న..జాకెట్ లేకుండా..శైలపుత్రి సంప్రదాయంలో ఉండటంతో..నెటిజన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. 

నిహారిక ఫోటో పోస్ట్ చేస్తూ..‘శైలపుత్రి, పర్వతాల కూతురు..ఆరెంజ్ ప్రకాశం, బలం మరియు దయను వర్ణిస్తుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా..కొంతమంది బ్యూటిఫుల్, గ్రేట్ అటెంప్ట్ అని కామెంట్స్ చేస్తుండగా.. ఒక నెటిజన్ మాత్రం ‘అడుక్కు తినే దానిలా ఉన్నావు నిజంగా’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మెగా ఇంట్లో నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మ్యారేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యారేజ్ కు సంబంధించిన పనులన్నీ నిహారిక దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 

ALSO READ : ENG vs AFG: 117కే 5 వికెట్లు.. ఉత్కంఠ రేపుతున్న ఇంగ్లాండ్ - అఫ్ఘాన్ మ్యాచ్

ప్రస్తుతం నిహారిక ఇంస్టాగ్రామ్ లో పెట్టె పోస్ట్స్ చూస్తుంటే..ఏదో కారణం అయితే బలంగా ఉందనే మాట వినిపిస్తోంది.ఇప్పటికే హీరోయిన్ గా  నాలుగు, ఐదు సినిమాలు చేసిన పెద్దగా ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో మళ్ళీ హీరోయిన్ గా ఛాన్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.