కర్నాటకలో మళ్లీ మాస్క్ రూల్​

కర్నాటకలో మళ్లీ మాస్క్ రూల్​

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
గైడ్​లైన్స్ జారీ​ చేసిన ప్రభుత్వం

బెంగళూరు/పాట్నా: వరల్డ్​ వైడ్​గా ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ బీఎఫ్.7 కేసులు పెరుగుతుండటంతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఒక్కరు మాస్క్​ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్​ వేడుకల్లో భాగంగా ఎక్కువమంది గుమిగూడొద్దని సూచించింది. కర్నాటక హెల్త్​ మినిస్టర్​ కేశవ సుధాకర్​ సోమవారం పలు మార్గదర్శకాలను రిలీజ్​ చేశారు. మూవీ థియేటర్లు, స్కూల్స్, కాలేజీల్లో తప్పకుండా మాస్క్​ ధరించాలన్నారు. న్యూ ఇయర్​ వేడుకల్లో భాగంగా పబ్స్, రెస్టారెంట్స్, బార్స్​లో మాస్క్​ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. రాత్రి ఒంటి గంటకల్లా న్యూ ఇయర్​ వేడుకలు ముగించుకోవాలన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బూస్టర్​ డోసు వేసుకోవాలని, సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని సూచించారు. 

నలుగురు ఫారెనర్స్​కు పాజిటివ్

బీహార్​లోని గయా ఎయిర్ పోర్టులో చేసిన ఆర్​టీపీసీఆర్​ టెస్టులో నలుగురు ఫారెనర్స్​కు పాజిటివ్​ వచ్చిందని డిస్ట్రిక్​ మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ రంజన్​ సింగ్​ తెలిపారు. వారిని ఐసోలేషన్​కు తరలించినట్టు చెప్పారు. నలుగురిలో మయన్మార్, థాయ్​లాండ్​ నుంచి ఒక్కొక్కరు, ఇంగ్లండ్​ నుంచి ఇద్దరు వచ్చినట్టు తెలిపారు. 33 మంది ఫారెనర్లకు టెస్ట్​ చేయగా.. నలుగురికి పాజిటివ్​ వచ్చిందన్నారు.