గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్లు.. కొడుకులను మధ్యలో పెట్టాలని చూస్తున్నరు : తమిళి సై

గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్లు..  కొడుకులను మధ్యలో పెట్టాలని చూస్తున్నరు : తమిళి సై

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఏప్రిల్ 15న జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదని, వచ్చుంటే వెళ్లేదాన్నని గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళల హక్కుల గురించి మాట్లాడారన్న ఆమె.. కానీ ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యమని చెప్పారు. అందుకే రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని ఆమె స్పష్టం చేశారు.

తార్నాక లోని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN), విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో జాతీయ పాలక మండలి సభ్యులు, విజ్ఞాన భారతి, కేఎస్ శాస్త్రి రచించిన  స్వతంత్ర సమరంలో విజ్ఞాన శాస్త్రం అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తో పాటు ICMR-NIN డైరెక్టర్ హేమలత హాజరయ్యారు. బ్రిటిష్ పరిపాలన కారణంగా దాగి ఉన్న చరిత్ర ఇప్పుడు ఓ పుస్తకం రూపంగా బయటికి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. ఇలాంటి పుస్తకాలు యంగ్ పీపుల్ కి తెలియాలన్న ఆమె.. ఆదివాసుల ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ పుస్తకం తెలుగులో ఉన్న కారణంగా చదవలేకపోతున్నానన్న గవర్నర్..  ట్రాన్స్ లేట్ చేసి చదువుతానని వెల్లడించారు.

ఇన్నేండ్ల స్వాతంత్రంలో ఎడ్యుకేషన్ పాలసీ కోసం ఎదురు చూశాం.. కానీ కేంద్ర దాని నిజం చేస్తోందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.  గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్లు..  కొంత మంది రాజకీయ నాయకులు వారి కొడుకులను మధ్యలో ఉంచాలని అనుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జైలుకెళ్ళి ఒక్కరోజులో తిరిగి వచ్చినట్టు కాదు, గతంలో చిన్న వయసులోనే జైలుకెళ్ళిన ఫ్రీడమ్ ఫైటర్స్ కొన్ని రోజులపాటుగా జైళ్లోనే ఉండి ప్రజల రక్షణ కోసం ఆలోచించారని చెప్పారు. ఈ సందర్భంగా చేనేత కలను ప్రపంచానికి తెలిసేలా అగ్గిపెట్టెలో పట్టే చీరను కళాకారులు గవర్నర్ కి బహుమతిగా ఇచ్చారు.