రేపు బైంసాలో బీజేపీ బహిరంగ సభ

రేపు బైంసాలో బీజేపీ బహిరంగ సభ

నిర్మల్ జిల్లా: బైంసాలో బీజేపీ బహిరంగ సభ రేపు యధావిధిగా నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 వరకు సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ అనంతరం 2వ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అంతకుముందు నిర్వహించాలనుకున్న Y జంక్షన్ వద్ద యధావిధిగా నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.

అంతకుముందు.. హైకోర్టు సూచనల మేరకు సభ, పాదయాత్రను రీషెడ్యూల్ చేసినట్లు బీజేపీ సీనియర్ నేత గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు సూచనల మేరకే పాదయాత్ర నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.

5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని మహాపోచమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.