బీజేపీని ఓడించే సామర్థ్యం సమాజ్ వాదీ పార్టీకి లేదు

బీజేపీని ఓడించే సామర్థ్యం సమాజ్ వాదీ పార్టీకి లేదు

ఉత్తర్ప్రదేశ్లో 2 లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి పరాభవం తప్పలేదు. అజంగఢ్, రాంపూర్ రెండు స్థానాల్లో ఓటమి పాలైంది. ఇక్కడ రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సమాజ్ వాది పార్టీ ఓటమిపై ఎంఐఎం ఛీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. ఎస్పీ ఓటమి, అఖిలేష్ యాదవ్ పై ఆయన సెటైర్లు వేశారు.

బీజేపీని ఓడించే సామర్థ్యం సమాజ్ వాదీ పార్టీకి లేదని యూపీ బైపోల్ రిజల్ట్ నిరూపించిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. రాంపూర్, అజంగఢ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు సమాజ్ వాద్ పార్టీ అసమర్ధతను బయటపెట్టాయన్నారు. అసమర్ధ పార్టీలకు మైనార్టీ వర్గాలు ఓట్లు వేయకూడదన్నారు అసదుద్దీన్. పార్టీ ఓటమికి అఖిలేష్ యాదవ్ కారణమని ఆయన ఆరోపించారు. అహంకార ధోరణితో సమాజ్ వాది పార్టీ ప్రజల్లోకి వెళ్లలేదని అసదుద్దీన్ మండిపడ్డారు.