
కేసీఆర్ తాజ్ మహల్ కంటే అందమైన సెక్రటేరియట్ ను కట్టించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదును నిర్మిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని ఓవైసీ అన్నారు. తెలంగాణ మాదిరే దేశంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ మంచి పాలన అందిస్తారని చెప్పారు. తమను బీజేపీ బీ టీం అని కాంగ్రెస్సోళ్లు ప్రచారం చేస్తున్నారని.. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ లో అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలని అడిగితే మోడీ ఒప్పుకోవడం లేదని తెలిపారు.
తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అసదుద్దీన్ చెప్పారు. ఎన్నికలకు ఇంకా అక్టోబర్ వరకు సమయం ఉందన్నారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తాము వెళ్తామని.. పరేడ్ గ్రౌండ్ లోజరిగే బీఆర్ఎస్ మీటింగ్ కు తమకు సంబంధం లేదని చెప్పారు.