
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మళ్లీ మంత్రిగా చూడాలని ఉందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. గతేడాది ఒప్పో, ఇటీవల అమెజాన్, ఇవాళ వన్‌ప్లస్ సెంటర్స్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందంటూ వచ్చిన ఓ ట్వీట్‌పై సోమవారం అసద్ స్పందించారు. ఈ ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌దేనని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి రావడం వెనుక కేటీఆర్‌కు క్రెడిట్ ఇవ్వాలి. ఆయన మంత్రిగా మళ్లీ ప్రభుత్వంలోకి రావాలి” అని అందులో ఆకాంక్షించారు. ఒవైసీ ట్వీట్‌కు కేటీఆర్ కూడా స్పందిస్తూ.. ‘‘మెనీ థ్యాంక్స్ ఎంపీ సాబ్.. ఫర్ యువర్ వెరీ కైండ్ వర్డ్స్’’ అని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్‌ను తీసుకోవాలని సొంత పార్టీ నుంచే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అసద్ ట్వీట్.. దానికి కేటీఆర్ స్పందన ఆసక్తికరంగా మారింది.
Credit must be given to “ex minister”@KTRTRS ,waiting to see him back in governance https://t.co/ukbi46UIXj
— Asaduddin Owaisi (@asadowaisi) August 26, 2019