కట్ట మైసమ్మ బోనాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

కట్ట మైసమ్మ బోనాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ముషీరాబాద్,వెలుగు: లోయర్ ట్యాంక్ బండ్​లోని కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో వచ్చే ఆది, సోమ వారాల్లో ఆషాడ బోనాల జాతరను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ గౌతమ్ రాజు తెలిపారు. గురువారం ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం, మహిళలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి సాంబశివరావు, పూజారి సాత్విక్ శర్మ  పాల్గొన్నారు.