
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఆశీష్ పాండేను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త అధిపతిగా కళ్యాణ్ కుమార్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ వీరి నియామకాలను ఆమోదించింది.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పాండే..తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు MD ,CEOగా బాధ్యతలు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న కళ్యాణ్ కుమార్.. జూలైలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు MD, CEOగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ రెండు బ్యాంకుల కొత్త బాస్నియామకం అక్టోబర్ 9 నుంచి అమల్లోకి వస్తుంది.