కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్
  •     జితేశ్ వి పాటిల్​ భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టర్​గా ఆశిష్​ సంగ్వాన్​నియమితులయ్యారు. నిర్మల్​జిల్లా కలెక్టర్‌‌‌‌గా ఉన్న ఈయన్ను కామారెడ్డికి బదిలీ చేశారు. స్టేట్​లో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి కలెక్టర్‌‌‌‌గా గత రెండున్నరేళ్లుగా పని చేస్తున్న జితేశ్. వి. పాటిల్

భదాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. 2016 బ్యాచ్​కు చెందిన ఆశిష్​ సంగ్వాన్​ హర్యానా స్టేట్​వాసి. నిర్మల్​జిల్లాలో 2023 అక్టోబర్​ నుంచి కలెక్టర్​గా పని చేస్తున్నారు. ఈయన భార్య  క్రాంతి వల్లూరు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్​గా  ఉన్నారు.