రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే.. 

రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే.. 

ప్రస్తుత కాలంలో సినిమా సెలబ్రిటీలు ఆరు పదుల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇలా లేటు వయసులో ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి  రూపాలి  అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన 57 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆశిష్ విద్యార్థి..  రూపాలిని 57 ఏళ్ల  వయసులో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని వివరించారు.  తన రెండో పెళ్లి అంత ఈజీగా  జరగలేదని తెలిపారు. ఈ పెళ్లి సమయంలో తాను ఎంతో బాధను అనుభవించానని తెలియజేశారు. గత ఏడాది జరిగిన వ్లాగింగ్ అసైన్మెంట్ లో భాగంగా తానే  రూపాలిని కలిశానని ఆశిష్ తెలియజేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయమే ఏర్పడటంతోొ ఇద్దరం చాటింగ్ చేసుకున్నామని తెలిపారు. 

 

ఇక రూపాలి కూడా ఐదు సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయి ఎంతో బాధను అనుభవించిందని తెలిపారు. భర్త మరణం నుంచి బయటపడిన రూపాలి తనకు దగ్గర అయిందని, ఇలా ఒకరోజు చాట్ చేసుకుంటూ ఉండగా తనని నా జీవితంలోకి ఆహ్వానించి తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నానని చెప్పానని ఆశిష్ తెలిపారు. ఆమె  తన  నిర్ణయానికి ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నామన్నారు. రూపాలి తన జీవితంలోకి రావడం తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని ఆశిష్ విద్యార్థి వెల్లడించారు. అయితే తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానన్న సంఘటన తన కుటుంబ సభ్యులను ఎంతో బాధ పెట్టిందని ఆశిష్ విద్యార్థి తెలిపారు. 

తన మొదటి భార్య పిలూను తాను ఒక భార్యలా కాకుండా ఎప్పుడు స్నేహితుడిగానే తనతో చాలా సరదాగా ఉండేవాడిని అయితే తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితమే మారిపోయిందని, తన నుంచి విడిపోయే సమయంలో ఎంతో బాధపడ్డానని, ఇద్దరికీ చాలా కష్టంగా అనిపించిందని..  తన రెండో పెళ్లికి ముందు పడిన బాధ గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో పిలూ విద్యార్థి అని పిలవబడే రాజోషి విద్యార్థిని ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకున్నారు.  ఈ జంట 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.  ఆశిష్ విద్యార్థి తన వయస్సులో రెండవ వివాహం చేసుకోవడంపై తనకు ఎదురవుతున్న విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో చర్చించారు. తాను 'బూధా, ఖుసత్' వంటి పదాలతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు.   ప్రతి ఒక్కరూ వృద్ధులు అవుతారు. వృద్ధులు అయితే   ఎవరైనా సహవాసం కోరుకుంటే, అతను ఎందుకు చేయకూడదని ఆశిష్ విద్యార్థి అన్నారు.