అసాన్ (సౌత్ కొరియా): ఇండియా యంగ్ షట్లర్ అష్మితా చాలియా.. కొరియా మాస్టర్స్ సూపర్–300 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో అష్మిత 21–13, 16–21, 21–13తో రక్షిత రామ్‌రాజ్‌పై గెలిచింది. దాంతో కెరీర్‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
48 నిమిషాల మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడారు. మోకాలి గాయం నుంచి కోలుకుని వచ్చిన అష్మిత.. స్మాష్‌లు, ర్యాలీలతో ఆకట్టుకుంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న రక్షిత క్రాస్ కోర్టు విన్నర్లు, మెరుగైన నెట్ డ్రాప్స్‌తో గేమ్ గెలిచింది. కానీ డిసైడర్‌లో అష్మిత షాట్స్‌ను తీయలేక ఇబ్బందిపడింది. దాంతో వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. ఫైనల్లో అష్మిత.. నాలుగో సీడ్ హన్ క్వియాన్‌క్సి (చైనా)తో తలపడుతుంది.
