ఆర్టీసీని అప్పగించండి 4ఏళ్లలో లాభాల్లోకి తెస్తాం: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీని అప్పగించండి 4ఏళ్లలో లాభాల్లోకి తెస్తాం: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీని తమకు అప్పగిస్తే నాలుగేళ్లలో లాభాల్లోకి తెచ్చి చూపెడతామని అన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఆర్టసీకి సమ్మెకు మద్ధతుగా సాంబశివరావు చేస్తున్న దర్నాలో మాట్లాడిన ఆయన… ఒకవేల ఆర్టీసీని లాభాల్లో తేకపోతె జీతాలు అడగమని చెప్పారు. మాటలు మార్చడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని అన్నారు. సమ్మెపై ప్రభుత్వం కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పారు. ఆర్టీసీ విలీనం మెనిఫెస్టోలో లేదు అని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆర్టీసీకి 2400 కోట్ల అప్పు ఉంటే 4200 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని కేసీఆర్ చెప్పారని తెలిపారు. అయితే మిగిలిన పైసలు ఎవరికి ఇచ్చారో కేసీఆర్ కే తెలువాలని అన్నారు. ఈనెల 30 నజరిగే సకల జనుల భేరిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీజీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్.