తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మంచి ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌

తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మంచి ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌

తనలో హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాకుండా  మంచి ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్న విషయాన్ని తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదో టీ20లో  చూపెట్టాడు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన రెండో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే నికోలస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశాడతను. తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడాలని అనుకున్న పూరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో యువరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైనాతో పాటు సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెహ్వాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టాప్​బ్యాటర్లు  తమ పార్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చిన్న చిన్న స్పెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదుకునేవాళ్లు. 

ప్రస్తుత టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ని విభాగాల్లో స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నప్పటికీ అత్యవసరమైన సందర్భాల్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కీలక వికెట్లు తీసే బ్యాటర్లను మిస్​ అవుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ రూపంలో అలాంటి క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డేల్లో తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇస్తే మిడిలార్డర్​ బలోపేతం అవ్వడంతో పాటు పార్ట్​ టైమ్​ స్పిన్నర్​ఆప్షన్​తో బౌలింగ్​ బలం కూడా  పెరగనుంది.