హాంకాంగ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

హాంకాంగ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

ఆసియా కప్ లో హాంకాంగ్ పై 40 రన్స్ తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో భారత్ సూపర్ 4 కు దూసుకెళ్లింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హాంకాంగ్ 152 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ హయత్ 41, జషన్ అలీ 26 కించిత్ షా 30 మినహా  మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన హాంకాంగ్ 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, జడేజా, అవేశ్ ఖాన్ లు ఒక్కో వికెట్ తీశారు. సూర్య కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.

అంతకు ముందు  టాస్ ఓడి బ్యాటింగ్ కు  దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.  ఓపెనర్ కేఎల్ రాహుల్ 36, కెప్టెన్ రోహిత్ శర్మ 21 పరుగులతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్ 68(నాటౌట్), కోహ్లీ 59( నాటౌట్) తో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి బౌలర్లపై వీరవిహారం చేశాడు. 6 సిక్సులు,6 ఫోర్లతో రెచ్చిపోయి 26 బంతుల్లోనే 68 పరుగులు చేయడంతో.. భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.