Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్.. ACC ఛైర్మన్ నుంచి అధికారిక ప్రకటన

Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్.. ACC ఛైర్మన్ నుంచి అధికారిక ప్రకటన

ఆసియా కప్ 2025పై సస్పెన్స్ వీడింది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు ఆసియా కప్ 2025 జరుగుతుంది. ఈ విషయాన్ని శనివారం (జూలై 26) ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ అధికారికంగా ప్రకటించాడు. మరోసారి హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్  జరుగుతుందని కన్ఫర్మ్ చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 24న ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. 2026లో భారత్,  శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఈ టోర్నీని టీ20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. 

ALSO READ | IND vs ENG 2025: ఘోరంగా విఫలమైన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం

కేవలం డేట్స్ మాత్రమే ప్రకటించబడ్డాయి. టోర్నమెంట్ షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. "యూఏఈలో ACC మెన్స్ ఆసియా కప్ 2025 తేదీలను ధృవీకరించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగుతుంది. అద్భుతమైన క్రికెట్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. షెడ్యూల్ చేయబడిన వివరాలు త్వరలో వెలువడతాయి". అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ నఖ్వీ శనివారం (జూలై 26) సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

ఈ ఎడిషన్‌లో మొత్తం ఎనిమిది జట్లు ఆడబోతున్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ, హాంకాంగ్,  ఒమన్ జట్లు ఈ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా , పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరిగే అవకాశం కలిగించేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లన్నీ తటస్థ వేదికైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో  జరగనున్నట్టు తెలుస్తుంది.