గట్టెక్కిన బంగ్లాదేశ్‌.. ‌‌‌8 రన్స్‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌పై గెలుపు.. సూపర్‌‌‌‌-4 ఆశలు సజీవం

గట్టెక్కిన బంగ్లాదేశ్‌.. ‌‌‌8 రన్స్‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌పై గెలుపు.. సూపర్‌‌‌‌-4 ఆశలు సజీవం
  • రాణించిన తన్జిద్‌‌‌‌, సైఫ్‌‌‌‌, ముస్తాఫిజుర్‌‌‌‌

అబుదాబి: చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఆసియా కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌పై బంగ్లాదేశ్‌‌‌‌ పైచేయి సాధించింది. బ్యాటింగ్‌‌‌‌లో తన్జిద్‌‌‌‌ హసన్‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 52), సైఫ్‌‌‌‌ హసన్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 30)కు తోడు బౌలర్ల సమయోచిత ప్రదర్శనతో మంగళవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో  బంగ్లా 8 రన్స్‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌పై గెలిచి సూపర్‌‌‌‌–4 ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్‌‌‌‌ గెలిచిన బంగ్లాదేశ్‌‌‌‌ 20 ఓవర్లలో 154/5 స్కోరు చేసింది. తర్వాత అఫ్గానిస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 146 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. రెహమానుల్లా గుర్బాజ్‌‌‌‌ (35), అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ (30) మెరుగ్గా ఆడారు. రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (20), గుల్బాదిన్‌‌‌‌ నైబ్‌‌‌‌ (16), మహ్మద్‌‌‌‌ నబీ (15), నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (14) పోరాడారు. ఆఖరి ఓవర్‌‌‌‌లో విజయానికి 22 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో నూర్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లతో ఆశలు రేకెత్తించినా ప్రయోజనం దక్కలేదు. ముస్తాఫిజుర్‌‌‌‌ 3, నాసుమ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, టస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, రషీద్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. నాసుమ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఓపెనర్లు అదుర్స్‌‌‌‌
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌‌‌‌లోనే క్యాచ్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ నుంచి బయటపడిన సైఫ్‌‌‌‌ హసన్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో కుదురుకున్నాడు. మూడో ఓవర్‌‌‌‌లో నాలుగు ఫోర్లతో తన్జిద్‌‌‌‌ టచ్‌‌‌‌లోకి వచ్చాడు. ఆ వెంటనే సైఫ్‌‌‌‌ 6,4తో జోరు పెంచాడు. ఆరో ఓవర్‌‌‌‌లో తన్జిద్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లు బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో బంగ్లా 59/0 స్కోరు చేసింది. అయితే ఏడో ఓవర్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు దిగిన రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (2/26).. లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో సైఫ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో తొలి వికెట్‌‌‌‌కు 64 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తన్జిద్‌‌‌‌తో కలిసి లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌ (9) సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేశాడు. 10వ ఓవర్‌‌‌‌లో తన్జిద్‌‌‌‌ మూడో సిక్స్‌‌‌‌ బాదడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో బంగ్లా 87/1తో మంచి స్థితిలో నిలిచింది. కానీ 11వ ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కే నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (2/23).. లిటన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. రెండో వికెట్‌‌‌‌కు 24 రన్స్‌‌‌‌ జతయ్యాయి.

28 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన తన్జిద్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ ఝుళిపించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. 13వ ఓవర్‌‌‌‌లో నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌కే వికెట్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. ఇదే ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కు తౌహిద్‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌ (26) సిక్స్‌‌‌‌తో ఖాతా తెరిచాడు. 14వ ఓవర్‌‌‌‌లో షామిమ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (11) రెండు ఫోర్లతో, తర్వాతి ఓవర్‌‌‌‌లో హ్రిదోయ్‌‌‌‌ బౌండ్రీతో 15 ఓవర్లలో స్కోరు 119/3కి చేరింది. 16వ ఓవర్‌‌‌‌లో రషీద్‌‌‌‌.. షామిమ్‌‌‌‌ను ఎల్బీ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌ 17 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో జాకెర్‌‌‌‌ అలీ (12 నాటౌట్‌‌‌‌) వేగంగా ఆడినా, 19వ ఓవర్‌‌‌‌లో హ్రిదోయ్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో ఐదో వికెట్‌‌‌‌కు 18 రన్స్‌‌‌‌ సమకూరాయి. నూరుల్‌‌‌‌ హసన్‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌) చకచకా సింగిల్స్‌‌‌‌ తీయడంతో బంగ్లా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. 

సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్‌‌‌‌: 20 ఓవర్లలో 154/5 (తన్జిద్‌‌‌‌ హసన్‌‌‌‌ 52, సైఫ్‌‌‌‌ హసన్‌‌‌‌ 30, రషీద్‌‌‌‌ 2/26, నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ 2/23). అఫ్గానిస్తాన్‌‌‌‌: 20 ఓవర్లలో 146 ఆలౌట్‌‌‌‌ (రెహమానుల్లా గుర్బాజ్‌‌‌‌ 35, ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ 30, ముస్తాఫిజుర్‌‌‌‌ 3/28).