కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్.. వర్షం పడుతుందా..? లేదా..?

కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్.. వర్షం పడుతుందా..? లేదా..?

ఆసియా కప్ 2023 మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆతిధ్య శ్రీలంక జట్టు పటిష్టమైన భారత్ తో తలబడబోతుంది. సూపర్-4లో ఇరు జట్లు రెండు విజయాలతో ఫైనల్ కి దూసుకెళ్ళగా.. నేడు జరిగే ఫైనల్లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే గత కొంతకాలంగా  సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న శ్రీలంక జట్టుని తక్కువగా అంచనా వేస్తే భారత్ కి షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.   మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్.. స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
 
కొలొంబోలో సూరీడు 

నిన్నటి వరకు ఈ మ్యాచులో వర్షం పడే అవకాశాలు ఉండడంతో ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ప్రస్తుతం కొలొంబోలో బాగా ఎండ కాస్తుంది.మేఘాలు తొలగిపోయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.  వాతవరణ సమాచార ప్రకారం ఈ రోజు వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో రిజల్ట్ పక్కా అంటున్నారు. ఒకవేళ నేడు మ్యాచ్ జరగకపోయినా రేపు రిజర్వ్ డే ఉండడంతో ట్రోఫిని ముద్దాడే ఛాన్స్ ఎవరికీ వస్తుందో చూడాలి.

ముఖాముఖిలో టీమిండియాదే పై చేయి  

ఆసియా కప్ ఫైనల్లో భారత్-శ్రీలంక ఇప్పటివరకు ఏడు సార్లు తలపడ్డాయి. వీటిలో నాలుగు సార్లు భారత్.. మరో మూడు సార్లు లంక జట్లు విజయం సాధించాయి. ఇక ఈ ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక సూపర్-4 మ్యాచులో రోహిత్ సేన 41 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. మొత్తానికి స్టార్ ప్లేయర్లతో భారత్ పటిష్టంగా కనబడుతుంటే.. సొంతగడ్డపై ఆడనుండడం శ్రీలంకకు అనుకూలంగా మారింది.