
హైటెక్ యుగంలో ఉన్నత చదువులు చదవాలన్నా..అత్యున్నత ఉద్యోగం సాధించాలన్నా .. పట్టణాలకు వెళ్లాలంటారు. కాని ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల పల్లెటూరు 75 శాతం అక్షరాస్యత సాధించడమే ఆ గ్రామంలో 80 శాతం మంది అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించారు. దీంతో ఆ గ్రామం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ధోర్రా మాఫీ అనే గ్రామంలో చాలా మంది విద్యావంతులు నివసిస్తున్నారు. ఈ గ్రామం ఆసియాలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామం పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదు చేశారు. భారతదేశం సంస్కృతి, ఆహారం, కళా రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది గాంచింది. వాస్తవానికి ఈ గ్రామం భారతదేశంలో మాత్రమే మొత్తం ఆసియాలోనే అత్యంత విద్యావంతులైన గ్రామంగా గుర్తింపు పొందింది.
2002లో ధోర్రా మాఫీ అనే ఈ గ్రామం పేరు 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చేరిందని స్థానిక నివాసి తయ్యబ్ ఖాన్ చెప్పారు. ఇక్కడ అక్షరాస్యత రేటు 75 శాతానికి పైగా నమోదైంది. ఈ గ్రామం పేరు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం సర్వే కోసం ఎంపిక చేయబడిందని స్థానికులు తెలిపారు. దొర్రా మాఫీ గ్రామంలో పక్కా గృహాలు, 24 గంటల కరెంటు , నీరు మరియు అనేక ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి. ఈ గ్రామ ప్రజలు వ్యవసాయమే కాకుండా ఉద్యోగాలపై కూడా ఆధారపడి ఉన్నారు. ధోర్రా మాఫీ గ్రామ ప్రజలు విద్యావంతులు. అక్షరాస్యత విషయంలో ఇక్కడి స్త్రీలు కూడా పురుషులతో సమానం. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ సిరాజ్ ఐఏఎస్ అధికారి. ఫైజ్ ముస్తఫా అనే వ్యక్తి ఒక విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు చాలా మంది విదేశాల్లో కూడా నివసిస్తున్నారు.
గ్రామంలోని 80 శాతం ఇళ్లలో అధికారులు
మాఫీ గ్రామంలో 10-11 వేల మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 90 శాతానికి పైగా ప్రజలు అక్షరాస్యత కలిగి ఉన్నారు. ఈ గ్రామంలోని 80 శాతం మంది ప్రజలు దేశవ్యాప్తంగా అనేక పెద్ద పోస్టుల్లో ఉన్నారు. ఈ గ్రామంలోని వారు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్‌లుగా ఉన్నారు. ధోర్రా మాఫీ గ్రామం అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి ఆనుకుని ఉంది. ఇక్కడి ప్రొఫెసర్లు, డాక్టర్లు తమ ఇళ్లను గ్రామంలోనే నిర్మించుకున్నారు.