ఢాకా: ఇండియా రికర్వ్ ఆర్చర్లు కొరియన్ సవాల్‌ను ఛేదించడంలో మరోసారి విఫలమయ్యారు. ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో ఓడిన ఇండియా మెన్స్, విమెన్స్ రికర్వ్ జట్లు సిల్వర్ మెడల్స్‌తో సరిపెట్టుకున్నాయి. ఇక, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. ఓవరాల్‌గా ఓ గోల్డ్, నాలుగు సిల్వర్, రెండు బ్రాంజ్‌లతో కలిపి ఏడు మెడల్స్‌తో ఇండియా టోర్నీని ముగించింది. మెన్స్ రికర్వ్ టీమ్ ఫైనల్లో కపిల్, ప్రవీణ్ జాదవ్, పార్థ్‌తో కూడిన ఇండియా జట్టు 2-6 తో కొరియా చేతిలో ఓడింది. విమెన్స్ ఫైనల్లో అంకిత, మధు వేద్వాన్, రిధీతో కూడిన ఇండియా జట్టు 0-6 తో కొరియా చేతిలో ఓడింది. ఇక, మిక్స్‌డ్ టీమ్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో కపిల్- అంకిత జోడీ 6-0తో ఉజ్బెకిస్తాన్ జోడీపై గెలిచింది.
