న్యూఢిల్లీ : రూ. 13.83 కోట్ల జీఎస్టీ, రూ. 1.38 కోట్ల పెనాల్టీ కట్టాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ పంపిన డిమాండ్ నోటీసు అందుకున్నామని ఏషియన్ పెయింట్స్ సోమవారం తెలియజేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017-–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే పన్నులను చెల్లించిందని తెలిపింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ఆర్డర్ వచ్చింది.
