ఏషియన్ పెయింట్స్ నికర లాభం రూ.1448 కోట్లు

ఏషియన్ పెయింట్స్ నికర లాభం రూ.1448 కోట్లు

ఏషియన్ పెయింట్స్ నికర లాభం 35 శాతం పెరిగి రూ. 1448 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసకంలో మార్కెట్ అంచనాలను మించి మూడో త్రైమాసిక లాభాల్లో ఏషియన్ పెయింట్స్ చెప్పుకోదగ్గ పెరుగుదలను నమోదు చేసింది. 

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ డేటా ప్రకారం సగటు 14.04 బిలియన్ రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికం చివరి నాటికి డిమాండ్ లో కొంచెం తగ్గుదల ఉన్నప్పటికీ 2023 అక్టోబర్ చివరలో ప్రారంభమైన పండుగ సీజన్ కంపెని వృద్ధికి తోడ్పడింది. 

బెర్గాన్ పెయింట్స్ ఇండియా, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్ కంటే త్రైమాసిక ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ ముందంజలో ఉంది. కన్సాయ్ షేర్లో 2 శాతం పెరుగుదల కనిపించగా ఇతర పెయింట్ కంపెనీలు తమ స్టాక్  విలువలలో క్షీణతను చవిచూశాయి.