ఏషియన్ పెయింట్స్‌‌‌‌ లాభం రూ. 1,073 కోట్లు

ఏషియన్ పెయింట్స్‌‌‌‌ లాభం రూ. 1,073 కోట్లు

రెవెన్యూ రూ.8,637 కోట్లు

న్యూఢిల్లీ: ఏషియన్ పెయింట్స్‌‌‌‌కు డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ3) లో రూ. 1,073 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌)  వచ్చింది. 2021 లోని  డిసెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కంపెనీ లాభం ఈసారి  5.6 శాతం పెరిగింది. రెవెన్యూ రూ. 8,636.74 కోట్ల వద్ద ఫ్లాట్‌‌‌‌గా రికార్డయ్యింది.  కంపెనీ లాభం, రెవెన్యూ ఎనలిస్టులు వేసిన అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.   ‘వర్షాకాలం   అక్టోబర్ నెలలో కూడా కొనసాగింది. దీంతో  పండగ సీజన్‌‌‌‌లో  కంపెనీ సేల్స్‌‌‌‌ తగ్గాయి. కానీ, నవంబర్‌‌‌‌‌‌‌‌, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పుంజుకుంది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో రెండంకెల గ్రోత్‌‌‌‌ను కంపెనీ  డెకరేటివ్   బిజినెస్‌‌‌‌ నమోదు చేసింది’ అని ఏషియన్ పెయింట్స్ పేర్కొంది.  

కొన్ని రామెటీరియల్స్ ధరలు తగ్గడంతో క్యూ3 లో ఆపరేటింగ్ మార్జిన్స్ మెరుగుపడ్డాయని పేర్కొంది.  ఆటో మొబైల్‌‌‌‌, ఇతర ఇండస్ట్రీలు మెరుగ్గా ఉండడంతో  పెయింట్స్ బిజినెస్ మంచి పనితీరు కనబరిచిందని వివరించింది.  కంపెనీ ఇంటర్నేషనల్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ మిశ్రమంగా ఉంది. మిడిల్ ఈస్ట్‌‌‌‌, ఆఫ్రికా దేశాల్లో గ్రోత్‌‌‌‌ నమోదు చేసినా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి మార్కెట్‌‌‌‌లో గ్రోత్ తగ్గిందని కంపెనీ సీఈఓ అమిత్ సింగ్లా అన్నారు.  ఇంటర్నేషనల్ సేల్స్ క్యూ3 లో 2.1 % పెరిగి రూ.778.82 కోట్లుగా నమోదయ్యాయని చెప్పారు.  దేశంలో హోమ్‌‌‌‌ డెకర్  మార్కెట్ విస్తరిస్తోందని,  క్యూ3 లో కిచెన్‌‌‌‌, బాత్  సెగ్మెంట్‌‌‌‌లో మాత్రం స్లోడౌన్ కనిపించిందని అన్నారు.  ఏషియన్ పెయింట్స్ షేరు గురువారం 3.12 % తగ్గి రూ. 2,853 వద్ద సెటిలయ్యింది.