
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా షూటర్ల గురి అదురుతోంది. సోమవారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల టీమ్ పిస్టల్‌లో మను బాకెర్–-ఇషా సింగ్–-సిమ్రన్‌ప్రీత్ కౌర్ బ్రార్ 1749 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకెర్ (25), ఇషా సింగ్ (18) వరుసగా నాలుగు, ఆరో స్థానంలో నిలిచారు. విమెన్స్ ట్రాప్‌లో నీరూ దండ (43), ఆషిమా అహ్లావత్ (29) గోల్డ్, బ్రాంజ్ సాధించారు.
మెన్స్ ట్రాప్ ఫైనల్లో బౌనీష్ మెండిరట్ట (45) కాంస్య పతకాన్ని నెగ్గాడు. 25 మీటర్ల పిస్టల్ జూనియర్ విభాగంలో మూడు పతకాలను మనోళ్లే సొంతం చేసుకున్నారు. ఫైనల్లో పాయల్ ఖత్రి (36), నామ్య కపూర్ (30), తేజస్విని (27) వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గారు. టీమ్ విభాగంలోనూ ఈ ముగ్గురు 1700 పాయింట్లతో సిల్వర్‌ను సాధించారు. కొరియాకు గోల్డ్, కజకిస్తాన్‌కు బ్రాంజ్ మెడల్స్ లభించాయి.