తారకరామ థియేటర్ ను పున:ప్రారంభించిన బాలయ్య

తారకరామ థియేటర్ ను పున:ప్రారంభించిన బాలయ్య

తారకరామ థియేటర్ పెద్దాయన (సీనియర్ ఎన్టీఆర్) జ్ఞాపకమని.. ఆయన శతజయంతి సందర్భంగా దీనిని పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇవాళ కాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్ ను బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం  మాట్లాడిన ఆయన.. సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చారన్నారు. అమ్మ, నాన్నల పేర్లు కలిసి వచ్చేటట్లు ఈ థియేటర్ కు పేరు పెట్టారని తెలిపారు. 

ఈ థియేటర్ లొనే తన అబ్బాయికి మోక్షజ్ఞ అని పేరు పెట్టామని అన్నారు. ఇక్కడికి వస్తే పాత రోజులు గుర్తొస్తాయని తెలిపారు. ఈ థియేటర్ లో అందరికి అందుబాటు ధరల్లోనే టికెట్స్ ఉంటాయన్నారు. ప్రేక్షకులు థియేటర్ లలో సినిమా చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడతారని బాలయ్య చెప్పారు. డాన్ మూవీ 525 రోజులు ఈ థియేటర్ లో ఆడిందని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

ఏషియన్ గ్రూపుతో కలిసి తారకరామ థియేటర్ ను కొత్త హంగులతో నందమూరి కుటుంబం ముస్తాబు చేసింది. 590 సీట్ల సామర్థ్యంతో 4K ప్రొజెక్షన్ తో థియేటర్ ను రీ ఓపెన్ చేశారు. ఈ నెల 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామ థియేటర్ లో షోస్ ప్రారంభం కానున్నాయి.