ఇండియాకు మరో 8 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియాకు మరో 8 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆసియా ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైక్లింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య ఇండియా మెడల్స్‌‌‌‌‌‌‌‌ మోత మోగిస్తోంది. తొలి రోజు పది పతకాలు నెగ్గిన ఇండియా రెండో రోజు ఆదివారం మరో ఎనిమిది మెడల్స్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది. ఇందులో ఒక గోల్డ్‌‌‌‌‌‌‌‌, మూడు సిల్వర్‌‌‌‌‌‌‌‌, నాలుగు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. రెండో రోజు పారా సైక్లింగ్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ లభించాయి. సీనియర్‌‌‌‌‌‌‌‌, జూనియర్స్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో మరో ఐదు దక్కాయి. ట్రాక్‌‌‌‌‌‌‌‌ సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌ మయూరి లూడె 500 మీ. టైమ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌లో 36.481 సెకండ్లతో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ పర్స్యూట్‌‌‌‌‌‌‌‌లో పూజా 21:31.277 టైమింగ్‌‌‌‌‌‌‌‌తో కొత్త నేషనల్‌‌‌‌‌‌‌‌ రికార్డు సృష్టిస్తూ కాంస్యం నెగ్గింది.   జూనియర్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ 2 కి.మీ రేస్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో నీరజ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కొద్దిలో గోల్డ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయి సిల్వర్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టాడు. అయితే, ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌ సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌ యిసో అల్బెన్ మెన్స్‌‌‌‌‌‌‌‌ ఎలైట్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పతకం నెగ్గలేకపోయాడు.