
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఇండియా యంగ్ రెజ్లర్ ఉదిత్.. సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌ను గెలిచాడు. గురువారం జరిగిన మెన్స్ 57 కేజీ ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమిమా (జపాన్) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఉదిత్ 4–3తో కుమ్ యుకో కిమ్ (కొరియా)పై, తొలి రౌండ్‌లో10–8తో ఇబ్రహీం మహిద్ ఖర్కీ (ఇరాన్)పై, క్వార్టర్స్‌లో 6–4తో అల్మాజ్ సమన్‌బెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచి టైటిల్ ఫైట్‌కు చేరాడు. మెన్స్ 70 కేజీ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్స్‌లో అభిమన్యు 6–5తో బెగిజోన్ కుల్దెషెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. 97 కేజీల్లో విక్కీ 10–1తో ఆండ్రీ రొమనోవిచ్ ఆర్నోవ్ (కిర్గిస్తాన్)ను ఓడించి బ్రాంజ్ సాధించాడు. 65 కేజీ ప్లే ఆఫ్స్‌లో రోహిత్ కుమార్ 3–5తో మసనుస్కో ఓన్ (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. 79 కేజీ క్వాలిఫికేషన్‌లో పర్వీందర్ సింగ్ 0–3తో రుయ్‌నోస్క్ కామియా (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు.