ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పటేళ్ల (గ్రామపెద్ద) ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గ్రామ పెద్దల హవానే నడుస్తోంది.
చాలా గ్రామాల ప్రజలు పటేళ్లు చెప్పినట్లే వింటారు. దీంతో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా అలాంటి గ్రామ పెద్దల ఇంటి ముందు క్యూ కడుతుంటారు. తమను గెలిపిస్తే గ్రామానికి ఏం చేస్తామో వివరిస్తూ వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో పటేళ్ల సమక్షంలో చర్చలు జరిపి అందరికీ అనుకూలమైన అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు.
లింగపూర్ మండలంలోని కంచన్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల పటేళ్ల సమక్షంలో కుల పెద్దలు చర్చించి కనక పార్వతీబాయిని సర్పంచ్‌గా నిర్ణయించి ఆమె ఒక్కరితోనే నామినేషన్ వేయించారు. అలాగే సిర్పూర్ (యు) మండలంలోని కోహినూర్ గ్రామ పంచాయతీలో మూడు గ్రామాల పటేళ్ల సమక్షంలో డిగ్రీ చదువుకున్న మహిళ సిడం విజయలక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
వేయించారు.
