దహెగాం, వెలుగు: నిర్ణీత గడువులోగా రీ సర్వే పూర్తిచేయాలని ఆసిఫాబాద్కలెక్టర్హరిత ఆదేశించారు. దహెగాం మండలంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను శనివారం ఆమె పరిశీలించారు. గ్రామంలోని వ్యవసాయ భూములు, గ్రౌండ్ ట్రూతింగ్ పనులు, పొలిమేర, ఆవాస ప్రాంతాల సరిహద్దులతో పాటు ప్రభుత్వ భూములను పరిశీలించి, సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రైతులు, గ్రామస్తులతో మాట్లాడి, రీ-సర్వేపై వారి అభిప్రాయాలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరించారు. పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిబంధనలు ప్రకారం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు వినయ్ కుమార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే రామేశ్వర్, మండల సర్వేయర్ ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
