రైలుపై దాడి చేసిన కానిస్టేబుల్ అభ్యర్థులు

రైలుపై దాడి చేసిన కానిస్టేబుల్ అభ్యర్థులు

బిహార్ లోని హజీపూర్ లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు రచ్చ చేశారు. హజీపూర్ స్టేషన్ లో ఆగి ఉన్న రైలుపై దాడి చేశారు. వందల మంది అభ్యర్థులు ట్రాక్ పై ఉన్న రాళ్లతో రైలుపై దాడికి దిగారు. హజీపూర్ చుట్టుపక్కల ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్స్ బేతియా, మోతిహారీలలో వేశారు. ఆ రెండు పట్టణాలకు షెడ్యూల్డ్ ట్రెయిన్ వేయకపోవడంతో ఆగ్రహించిన అభ్యర్థులు హజీపూర్ స్టేషన్ లో వీరంగం సృష్టించారు.

కైమూర్, ససారాం జిల్లాల నుండి వచ్చిన అభ్యర్ధులు.. ఎగ్జామ్ సెంటర్స్ ఉన్న ప్రాంతాలకు హాజీపూర్ వద్ద రైలు మార్పిడి సౌకర్యం లేకపోవడంతో ఆగ్రహానికి లోనై ఈ దాడికి దిగారు.