
బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ లో ఆగస్టు 26వ తేదీ శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీజేపీ నేత, సిల్చార్ ఎంపీ రాజదీప్ రాయ్ ఇంట్లో తన తల్లి, అక్కతో కలిసి అనేక సంవత్సరాలుగా బాలుడు ఉంటున్నాడు. ఐదో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు..ఆగస్టు 26వ తేదీన రాత్రి ఉరేసుకున్నాడు. కారణం మాత్రం తెలియరాలేదు. దీనిపి సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకుని అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని సిల్చార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు.
బాలుడి కుటుంబం స్వస్థలం కాచర్ జిల్లా పలాంగ్ ఘాట్. కొద్ది సంవత్సరాల క్రితం బాలుడి తల్లి ఎంపీ రాజదీప్ రాయ్ ఇంట్లో పనికి చేరింది. బాలుడి తల్లి ఇంటి పనులు చేస్తుంటారు. అయితే తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు సొంత ఊరు నుంచి బాలుడి తల్లి సిల్చార్‌కు వచ్చిందని పోలీసులు తెలిపారు.
తన ఇంట్లో పనిచేసే మహిళ కొడుకు ఉరేసుకుని చనిపోయినట్లు సమాచారం అందుకున్న ఎంపీ రాజదీప్ రాయ్....వెంటనే ఇంటికి చేరుకున్నారు. గది లోపల బాలుడు ఉరేసుకున్నాడని తెలిపారు. గది తెరిచి చూసే సరికి అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పారు. తాము వెంటనే ఆసుపత్రికి తరలించామని..కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు వెల్లడించారు.
ఫోన్ అడిగితే ఇవ్వకపోతే..
మరోవైపు బాలుడి ఆత్మహత్యకు మొబైల్ ఫోన్ కారణమన్నట్లు తెలుస్తోంది. వీడియో గేమ్స్ ఆడుకోడానికి తల్లిని ఫోన్ అడిగితే... ఆమె నిరాకరించిందని..అందుకే తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు.. గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
.