మళ్లీ పెళ్లంటే ఇప్పుడే చేస్కోండి..!.. ఎన్నికలయ్యాక చేస్కుంటే జైలుకే!

మళ్లీ పెళ్లంటే ఇప్పుడే చేస్కోండి..!.. ఎన్నికలయ్యాక చేస్కుంటే జైలుకే!
  • ధుబ్రీ ఎంపీ అజ్మల్‌‌‌‌కు అస్సాం సీఎం కౌంటర్‌‌‌‌ 

దిస్పూర్‌‌‌‌ (అస్సాం): ఏఐయూడీఎఫ్‌‌ చీఫ్‌‌, ధుబ్రీ ఎంపీ అభ్యర్థి బద్రుద్దీన్‌‌ అజ్మల్‌‌ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ లోక్‌‌సభ ఎన్నికల్లోపే చేసుకోవాలని, తర్వాత చేసుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ హెచ్చరించారు. లోక్‌‌సభ ఎన్నికలై నంక యూసీసీ అమలు చేస్తామని, అప్పుడు బహుభార్యత్వం నేరమవుతుందని అన్నారు. కాగా, ఇటీవల ఓ మీటింగ్‌‌లో అజ్మల్‌‌ మాట్లాడు తూ.. ‘ప్రత్యర్థులు నాకు వయసైపోయిం దంటున్నరు.

కానీ ఇప్పుడు కూడా పెళ్లి చేసుకు నేంత బలంగా ఉన్నా. సీఎం హిమంతకు ఇష్టం లేకున్నా సరే నేను మళ్లీ పెళ్లి చేసుకోగలను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం హిమంత కౌంటర్‌‌‌‌ ఇచ్చారు. ‘మళ్లీ పెళ్లి చేస్కోవాలని అనుకుంటే ఇప్పుడే చేసుకో.. పిలిస్తే పెండ్లికి మేం కూడా వస్తం. కానీ ఎన్నికలయ్యాక చేస్కుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అరెస్టు చేసి జైలుకు పంపిస్తం. ఎందుకంటే, అప్పుడు రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వస్తుంది. యూసీసీ ప్రకారం.. బహుభార్యత్వం నేరం, దానికి శిక్ష తప్పదు’ అని అజ్మల్ కు సీఎం హిమంత శర్మ సూచించారు.