అసోంలో వరద విలయం

అసోంలో వరద విలయం

అసోంను వానలు..వరదలు వదలడం లేదు. వరుణుడు పగబట్టినట్టు బీభత్సం సృష్టిస్తున్నాడు.రాష్ట్రంలోని పలు జిల్లాలో వరదనీటిలో మునిగిపోయాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 21 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది.. నాగవ్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వదరల ధాటికి మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 134కి చేరింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. గత వారం రోజులుగా అసోం వరద గుప్పిట్లో చిక్కుకుంది. కనీసం తాగునీరు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వమే రిలీఫ్ మెటీరియల్ అందిస్తుందన్నారు నాగవ్ డిప్యూటీ కమిషనర్ నిసర్గ్ హివారే తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే వాటికి ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ప్రజలకు 3 రోజులకు సరిపడ నిత్యావసరాలు పంపామన్నారు. మరో ఐదు రోజులకు సరిపడ సామాగ్రి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైన డబ్బులు చెల్లించాలని అడిగితే తమకు తెలియజేయాలన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నిసర్గ్ హివారే. మరోవైపు అసోం వరద బాధితులకు  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ 25 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.