పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న రేప్ నిందితుడు.. ఆ తర్వాత శవమై తేలాడు

పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న రేప్ నిందితుడు.. ఆ తర్వాత శవమై తేలాడు

అస్సాం బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులలో ఒక నిందితుడు శవమై తేలాడు. పొలిసు కస్టడీ నుండి తప్పించుకున్న నిందితుడు తఫజుల్ ఇస్లాం చెరువులో దూకి మరణించాడు. శనివారం తెల్లవారుజామున పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన క్రమంలో చెరువులో దూకి మరణించినట్లు సమాచారం. ఇస్లాం ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 14ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అస్సాంలోని నాగావ్ జైల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

గురువారం ( ఆగస్టు 22, 2024 ) రాత్రి 8గంటల సమయంలో బాలిక ట్యూషన్ కి వెళ్లి వస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమెను చెరువు పక్కన పడేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

శనివారం తెల్లవారుజామున 3: 30గంటల సమయంలో నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన సమయంలో కస్టడీ నుండి తప్పించుకొని చెరువులో దూకాడని పోలీసులు తెలిపారు. ఆ వెంటనే సర్చ్ ఆపరేషన్ నిర్వహించి రెండు గంటల తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.