
అస్సాంలో దారుణం జరిగింది. యువతిని మోసం చేసి ఆమెపై తండ్రీ, కొడుకులు హత్యచారానికి పాల్పడ్డారు. నిందితుల ధనదాహానికి పోలీసులు అండగా నిలిచారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించింది.
అస్సాంలోని గౌహతికి చెందిన ప్రీతమ్ నాథ్.. 19ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమెను లోబరుచుకోవాలని మాయమాటలకు చెప్పాడు. పక్కా ప్లాన్ తో.. ప్రేమించుకున్నాం కదా. త్వరలోనే పెళ్లి చేసుకుందాం. ముహూర్తాలు లేవు. మీ అమ్మానాన్నలకు తెలిస్తే మన పెళ్లి జరగనివ్వరు అందుకే మా ఇంట్లోనే ఉండు.. అంటూ ప్రియురాలికి మాయమాటలకు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. కొద్దిరోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్న కీచకుడు ఆమెను అత్యాచారం చేశాడు. ప్రియుడుతో పాటు అతడి తండ్రి పెంచునాథ్ బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టాడు.
అయితే ఈ కిచకుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితులు ధనవంతులు కావడంతో పోలీసులు వారికి అండగా నిలిచారు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించింది. తండ్రీకొడుకులు తనని అత్యాచారం చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని వాపోయింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.