
అస్సాంలో ఘోరం జరిగింది. స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ శిలాదిత్య చెటియా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా శిలాదిత్య చెటియా భార్య అగమోని బ్రెయిన్ క్యాన్సర్ తో పోరాడుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఆమె చనిపోయిన పది నిమిషాలకు ఐసీయూ గదిలోనే భార్య మృతదేహం వద్ద సూసైడ్ చేసుకున్నారు శిలాదిత్య.
భార్య అనారోగ్యం కారణంగా శిలాదిత్య గత నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో జూన్ 18వ తేదీన కన్నుముశారు. విషయం తెలుసుకున్న శిలాదిత్య ఆసుపత్రికి చేరుకున్నారు. భార్య మృతదేహం ఉన్న గదిలో నుంచి డాక్టర్, నర్సును ఒక క్షణం బయటకు వెళ్లాలని చెప్పి తల వెనుక భాగంలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ దంపతులకు 2013లో మే 12 వివాహం జరగగా సంతానం కలగలేదు.2009-బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ శిలాదిత్య. చెటియా మరణ వార్త పోలీసు వర్గాలతో పాటు, ఆయన సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సహోద్యోగుల, సబార్డినేట్‌లు అతనితో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ విషాద ఘటనపై అస్సాం డీజీపీ జీపీ సింగ్ విచారం వ్యక్తం చేశారు.