అసెంబ్లీ నిరవధిక వాయిదా..5 రోజుల పాటు సెషన్స్.. 13 బిల్లులు ఆమోదం

అసెంబ్లీ నిరవధిక వాయిదా..5 రోజుల పాటు సెషన్స్.. 13 బిల్లులు ఆమోదం
  • రెండో సెషన్ నుంచే బాయికాట్ చేసిన బీఆర్ఎస్
  •  తొలి రోజు సభకు ప్రతిపక్ష నేత, ఆ తర్వాత గైర్హాజరు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ నిరవధిక వాయిదాపడింది. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 29, ఈ నెల 2,3,5,6 తేదీల్లో మొత్తం 5 రోజుల పాటు సభ జరిగింది. 40 గంటల 45 నిమిషాల పాటు సభ జరగగా, 13 బిల్లులను అసెంబ్లీ ఆమో దించినట్లు స్పీకర్ ప్రకటించారు. 

రెండు తీర్మానాలు చేయగా నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. హిల్ట్ పాలసీ, ఉపాధి హామీ చట్టం, తెలంగాణ రైజింగ్ 2047, కృష్ణా జలాల్లో తెలం గాణకు జరిగిన అన్యాయం.. వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉపాధి చట్టం నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించవద్దని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న అన్ని అను మతులు ఇవ్వాలని, పోలవరం నల్లమల్ల సాగర్ కు అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ అసెంబ్లీ చేసినతీర్మానాలను కేంద్రానికి పంపారు. కాగా కృష్ణా జలాల్లో గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

 కాగా ఈ నెల3న మూసీ రెనోవేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చేసమయంలో తమపై అసంబద్ధఆరోపణలు చేశారంటూ రెండోరోజు నుంచి సెషన్ ను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేసింది. గత నెల 29న అసెంబ్లీశీతాకాల సమావేశాలు స్టార్ట్ కాగా అదే రోజు ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్ సభకు అటెండ్ అయి నాలుగు నిమిషాలు సభలో ఉండి వెళ్లారు. తరువాతనుంచి సభకు ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు.