
తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి మల్టీజోన్ పోస్టులు. రాతపరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
పోస్టులు: 151
మల్టీ జోన్-1: 68 పోస్టులు (జనరల్ 27, బీసీ-ఏ 5, బీసీ-బీ 5, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 7, ఇతరులు 2)
మల్టీ జోన్-2: 83 పోస్టులు (జనరల్ 32, బీసీ-ఏ 7, బీసీ-బీ 7, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8, ఇతరులు 2) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు 1 జులై 2021 నాటికి 34 ఏండ్ల లోపువారై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష ద్వారా ఎంపిక.
ఎగ్జామ్ ప్యాటర్న్: మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్100 మార్కులకు ఉంటుంది. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీలకు రూ.750
వెబ్‌సైట్: www.tslprb.in