అసోచామ్ తెలంగాణ కో-చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీధర్రెడ్డి

అసోచామ్ తెలంగాణ కో-చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీధర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు : అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) తెలంగాణ చాప్టర్ తమ మొట్టమొదటి స్టేట్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించింది.  ఈ సందర్భంగా కంట్రోల్ ​ఎస్​ డేటా సెంటర్స్, క్లౌడ్​4సీ ఫౌండర్​ సీఈఓ శ్రీధర్ పిన్నపు రెడ్డిని  అసోచామ్ తెలంగాణ స్టేట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కౌన్సిల్ కో-–చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నుకున్నారు.

తొలి తరం వ్యాపారవేత్త  అయిన శ్రీధర్​  టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. ఆయన  2023–-24 సంవత్సరానికి  అసోచామ్  కో–-చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ  మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ సేవలు, గ్రీన్ ఎనర్జీ,  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వెంచర్లను ఆయన చేపట్టారు. ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్  (టై)  గ్లోబల్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాప్టర్ ప్రెసిడెంట్,  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ  సేవలు అందించారు.