ఆమోదానికి చేరువలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

ఆమోదానికి చేరువలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి.  ఇందులో అమెరికా మరో అడుగు ముందుగా ఉంది. ఆస్ట్రాజెనెకా  COVID-19 వ్యాక్సిన్ అమెరికాలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకుందని..ఆమోదానికి కూడా చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

“ఆస్ట్రాజెనెకా టీకా 3 వ దశ క్లినికల్ ట్రయల్స్కు చేరుకుందని.. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.  యునైటెడ్ స్టేట్స్ ప్రజలు సాధ్యం కాదని భావించిన పనులను తాము చేసి చూపిస్తున్నామన్నారు ట్రంప్. చాలా మంది ఈ  ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చన్నారు కానీ తాము కొన్ని నెలల్లోనే చేశామన్నారు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ  సైంటిస్టులు డెవ్ లప్ చేసిన న వ్యాక్సిన్‌ను అమెరికాలోని 80 నగరాల్లో పలు కేంద్రాల్లో  సుమారు 30 వేల వయోజన వాలంటీర్లను చేర్చుకున్నామని ఆస్ట్రాజెనెకా  ప్రకటించింది. ఇందులో  18 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారే ఉన్నారన్నారు. హెచ్ఐవితో భాదపడుతున్న వారు కూడా ఉన్నారన్నారు.

see more news

ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ..ఊపిరాడక పేషెంట్ మృతి

కలెక్టర్ రేట్ లో రైతుల ఆత్మ హత్యాయత్నం

భారత్ లో 65 వేలు దాటిన కరోనా మరణాలు