IPL 2026 Final:
రేపు (2026, మే 31న) అహ్మదాబాద్‌లో జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఫైనల్ ఫైట్ జరగబోతుంది. ఈ మహా సంగ్రామం గురించి క్రికెట్ ప్రేమికులతో పాటు జ్యోతిష్య నిపుణులు కూడా గ్రహాల గమనాన్ని లెక్కలేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌పై గ్రహాల ప్రభావం ఎలా ఉందో ప్రముఖ జ్యోతిష్య విశ్లేషణలు, ఆస్ట్రో ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
RCBకి పీక్స్‌లో గ్రహాల అనుకూలత:
ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ జాతకం చాలా బలంగా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో ఫైనల్ చేరిన జట్లలో దాదాపు 55 శాతం నుంచి 60శాతం వరకు ఆర్సీబీకే కప్పు కొట్టే ఛాన్స్ ఉందని జ్యోతిష్య లెక్కలు చెబుతున్నాయి.
* గ్రహాల సపోర్ట్: ఆర్సీబీకి కుజ గ్రహం (Strong Mars Energy), కర్కాటక రాశిలో ఉన్న గురు గ్రహం (Jupiter in Cancer) అద్భుతంగా అనుకూలిస్తున్నాయి. ఇది ఎంతటి ఒత్తిడి ఉన్న సమయంలోనైనా జట్టు ప్రశాంతంగా, సరైన నిర్ణయాలు తీసుకునేలాతోడ్పడుతుంది.
* మ్యాచ్ గమనం: మ్యాచ్ ప్రారంభంలో గుజరాత్ టైటాన్స్ జట్టు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, మిడిల్, చివరి ఓవర్లలో మ్యాచ్‌ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకునే నక్షత్ర బలం ఆర్సీబీకి అధికంగా ఉంది.
గుజరాత్ టైటాన్స్ పై శని ప్రభావం:
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ ప్రారంభంలో ఉన్న గ్రహాల ప్రతికూలతను తమ క్రమశిక్షణతో తలకిందులు చేస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. వీరి ట్రోఫీ గెలిచే అవకాశం 20 శాతం నుంచి 25 శాతం మాత్రమే ఉందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.
►ALSO READ | వర్షంతో RCB vs GT ఫైనల్ మ్యాచ్ క్వాన్సిల్ అయితే?.. విజేత ఎవరు!
* గ్రహాల స్థితి: గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఈ సీజన్లో గ్రహాల అనుకూలత కొంచెం మిశ్రమంగా ఉంది. శని గ్రహం (Saturn) వీరికి మంచి వ్యూహాత్మక క్రమశిక్షణను ఇస్తున్నప్పటికీ, టి20 ఫార్మాట్‌కు కావలసినంత అగ్రెసివ్, వేగంగా స్పందించడంలో కొద్దిగా నెమ్మదించేలా చేస్తుందట.
* సూర్య-చంద్రుల వ్యతిరేక ప్రభావం: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్నప్పుడు ఈ గ్రహాల స్థితి వల్ల జీటీపై కీలక క్షణాల్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఫైనల్ ముచ్చట:
* జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అంచనాల ప్రకారం: గ్రహాల బలం, నక్షత్రాల అనుకూలత, కాస్మిక్ ఎనర్జీ అన్నీ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఆర్సీబీ రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
Note: జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలం ఒక అంచనా మాత్రమే.. ఈ వార్త పూర్తిగా ఇంటర్నేట్ నుంచి సేకరించినది.. ఈ వార్తకి వీ6 న్యూస్ ఛానల్ కి ఎలాంటి సంబంధం లేదు.. కావునా ఏదైనా అనుమానాలు ఉంటే జ్యోతిష్య పండితులని, క్రీడా విశ్లేషకులని కలిసి మీ అనుమానాలని తీర్చుకోవాల్సిందే.
