హైదరాబాద్, వెలుగు : జ్యోతిష్యం మూఢ నమ్మకం కాదు.. భవిష్యత్‌కు మార్గదర్శకం అని ఎన్‌ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యన్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ నరసింహస్వామి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్యంపై జరిగిన సెమినార్‌ను ప్రొఫెసర్ సాంబశివరావు, గోపినాథ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహస్వామి మాట్లాడుతూ ఎన్‌ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్ ద్వారా ఆస్ట్రాలజర్స్ 24 గంటలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. సంస్థను విస్తరించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైసీ ఇస్తున్నట్టు చెప్పారు. అనంతరం జ్యోతిష్య పండితులకు ఎస్‌వీ.రమణారావు, పసుపులేటి అరుణ్‌కుమార్‌కు అవార్డులు, బహుమతులు అందించారు.
