హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు దీపారాధన.. పూజ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తులసి మొక్క నిద్రపోతుంది.(ఎండిపోతుంది) . అలా జరిగినప్పుడు ఆ మొక్కను ఏం చేయాలి.. నిద్రపోయిన తులసి ఇంట్లో ఉండే నష్టం జరుగుతుందా.. ఎలాంటి నియమాలు పాటించాలి.. మొదలగు విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందూ పురాణాల్లో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కలో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారని నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఇంట్లో ఈ మొక్కను పూజిస్తారు. అంతే కాదు ఇంట్లో సరైన స్థలంలో దీనిని నాటడం వలన శాంతి .. సంతోషం.. ఐశ్వర్యం ఉంటాయని విశ్వసిస్తారు. అయితే కొన్ని అనుకోని పరిస్థితులలో తులసి మొక్క నిద్రపోతుంది( ఎండిపోతుంది).
వాస్తు పండితులు తెలిపిన వివరాల ప్రకారం..నిద్రపోయిన తులసిమొక్క ఇంట్లో ఉంటే శుభశక్తిని అడ్డుకుంటుందని పండితులు చెబుతున్నారు. నిద్రపోయిన తులసి ప్రతికూల శక్తిని పెంచుతుంది. నిద్రపోయిన( ఎండిన) తులసి ఇంట్లో ఉంటే తరచూ ఆర్థిక సమస్యలు.. ఇతర కుటుంబ సమస్యలు వస్తాయి. అందుకే నిద్రపోయిన తులసి మొక్క ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఉంచవద్దని సూచిస్తారు.
నిద్రపోయిన ( ఎండిపోయిన) తులసి మొక్కను ఏం చేయాలి
నిద్రపోయిన తులసి మొక్కను దానిని కుండీలో నుంచి చాలా జాగ్రత్తగా తీసివేయాలి. (మంగళవారం.. శుక్రవారం..ఏకాదశి రోజుల్లోతీయకూడదు). ఆ తరువాత దీనిని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. పవిత్రనదుల్లో కలపాలి. లేదంటే హోమల్లో ఉపయోగించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో డస్ట్ బిన్ లో కాని.. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో పడవేయకూడదు. అలా చేస్తే.. జీవితంలో ఎనలేని కష్టాలు అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అలా చేయడానికి అవకాశం లేకపోతే.. పచ్చని చెట్టుదగ్గర మట్టిలో పాతి పెట్టండి. అంతేకారు నిద్రపోయిన తులసి మొక్క స్థానంలో కొత్త మొక్కను గురువారం కాని శుక్రవారం కాని నాటాలి. తులసి మొక్కను నాటే విషయంలో కొన్ని పద్దతులు ఉన్నాయి. ఉత్తరం లేదా తూర్పు దిక్కుల్లో గోమయంతో .. గో పంచకంతో శుద్ది చేసి ఆ స్థలంలో కుండీ లేదా మొక్కను నాటాలి.
పురాణాల ప్రకారం ఉత్తర దిక్కు సంపదకు అధిపతి.. తూర్పు దిక్కు నుంచి ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. సరైన దిశలో తులసిని నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆదివారాలు.. ఏకాదశి రోజుల్లో ఎట్టి పరిస్థితిలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఎందుకంటే ఆరోజుల్లో లక్ష్మీదేవి ఉపవాస దీక్షను పాటిస్తారని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
