గ్రాండ్ వెల్కమ్: ఢిల్లీకి చేరుకున్న వ్యోమగామి శుక్లా.. ఘనస్వాగతం పలికిన సీఎం రేఖాగుప్త.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్

గ్రాండ్ వెల్కమ్: ఢిల్లీకి చేరుకున్న వ్యోమగామి శుక్లా.. ఘనస్వాగతం పలికిన సీఎం రేఖాగుప్త.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్

అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు...  ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఘనంగా స్వాగతం పలికారు

ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆదివారం  ( ఆగస్టు 17) తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ)విమానాశ్రయానికి చేరుకున్నారు.   వ్యోమగామి శుభాన్షు శుక్లా భారత్‌ చేరుకున్నందుకు ...  సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారం'ఎక్స్‌'లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. శుక్లా సాధించిన విజయాన్ని ప్రశంసించారు. దేశమంతా అతని విజయాన్ని  గర్విస్తున్నదన్నారు.

భారత్‌ చేరుకున్న శుక్లా రేపు ( ఆగస్టు 18)  ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు.  తరువాత యూపీలోని సొంతూరు లక్నోకు వెళతారు.   అక్టోబర్‌లో నిర్వహించే  గగన్‌యాన్‌ మిషన్‌ శిక్షణలో పాల్గొంటారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

జూన్​ 25 న  అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నింగిలోకి దూసుకెళ్లారు.  యాగ్జియం-4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్‌ 26వ తేదీ నుంచి ఐఎస్‌ఎస్‌లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుక్లా   విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

తాను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయని శుక్లా అన్నారు .  ఏడాదిగా తన  స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్‌ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. 

జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం (ఆగస్టు 15)   హూస్టన్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్‌ నాయర్‌ కూడా పాల్గొన్నారు.