కోల్డ్‌ప్లే కన్సర్ట్ : లైవ్లో దొరికిపోయిన ఆస్ట్రోనోమర్ సీఈఓ, ఆమె ఎవరంటే..

కోల్డ్‌ప్లే కన్సర్ట్ : లైవ్లో దొరికిపోయిన ఆస్ట్రోనోమర్ సీఈఓ, ఆమె ఎవరంటే..

ఏదైనా పార్టీ లేదా లైవ్ షోకి వెళ్ళినపుడు ఒకేసారి మీపై స్పాట్ లైట్ పడితే ఎలా ఉంటుంది... ఒక్కసారి షాకైన ఒకోసారి ఏంటి అని నవ్వొస్తుంటుంది. కానీ అలంటి సీన్ ఒకటి ఇక్కడ జరిగింది. అది కూడా లైవ్ సింగింగ్ కన్సర్ట్లో... విషయం ఏంటంటే వీరిద్దరూ హాగ్ చేసుకున్న సమయంలోనే ఈ స్పాట్ లైట్ ఫోకస్ చేసింది.  

కోల్డ్‌ప్లే కన్సర్ట్ సందర్భంగా "కిస్ కామ్"లో ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్ హాగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం   వైరల్ అవుతుంది. దింతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని పుకార్ల వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో ఆండీ బైరాన్,  క్రిస్టిన్ కాబోట్ హౌజ్ హాగ్ చేసుకొని ఉండటం చూడొచ్చు. కెమెరా విరిపై ఒకేసారి ఫోకస్ చేయగానే ముఖాలను దాచుకుంటూ పక్కకు తప్పుకున్నారు.

ఈ సీన్ బుధవారం మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో జిల్లెట్ స్టేడియంలో జరిగిన  కోల్డ్‌ప్లే కన్సర్ట్ సందర్భంగా జరిగింది. కన్సర్ట్ సమయంలో  కెమెరా వీరిపై ఫోకస్ చేయగా  సింగర్  "ఓహ్ ఈ ఇద్దరిని చూడండి... వీరికి ఏదైనా అఫైర్ ఉందా లేక  సిగ్గుపడుతున్నారా ?" అంటూ  ప్రేక్షకులకి నవ్వులు తెప్పించారు. 

 

ఈ వీడియో  టిక్‌టాక్, రెడ్డిట్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయింది. ఇంటర్నెట్ యూజర్లయితే ఆశ్చర్యం, ఎంతెత్తైన్మెంట్, విమర్శలతో ముంచెత్తారు. కొందరు బైరాన్ భార్య పట్ల సానుకూలంగా ఉండగా, మరికొందరు  విమర్శించారు. ఈ సంఘటన కార్పొరేట్ సంస్కృతి గురించి చర్చలకు దారితీసింది. ప్రస్తుతానికి, ఈ సంఘటనకు సంబంధించి ఆస్ట్రోనోమర్ లేదా ఆండీ బైరాన్ నుండి ఎలాంటి  ప్రకటన వెలువడలేదు.

క్రిస్టిన్ కాబోట్ ఎవరు: క్రిస్టిన్ కాబోట్ ఆస్ట్రోనోమర్‌లో చీఫ్ పీపుల్ ఆఫీసర్. ఆస్ట్రోనోమర్ అనేది అపాచీ ఎయిర్‌ఫ్లో ద్వారా ఆధారితమైన డేటా ఆర్కెస్ట్రేషన్, అబ్జర్వబిలిటీ ప్లాట్‌ఫామ్‌ అందించే సంస్థ. ఆమె నవంబర్ 2024లో నియమితులయ్యారు.