భారత్, అమెరికా మధ్య టూ ప్లస్ టూ చర్చలు

భారత్, అమెరికా మధ్య టూ ప్లస్ టూ చర్చలు

అమెరికా వాషింగ్టన్ లో భారత్, అమెరికా మధ్య టూ ప్లస్ టూ చర్చలు జరిగాయి. ఇరు దేశాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ చర్చలు మైలురాయి అని అన్నారు భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.  ఈ పర్యటనతో.. సమగ్రవ్యూహాత్మక భాగస్వామ్యం మెరుగుపడుతుందన్నారు. భారత్ సరిహద్దుల్లో చైనా చట్టవిరుధ్ద పనులు చేస్తుందన్నారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్. సార్వభౌమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు భారత్ కు అమెరికా అండగా ఉంటుందన్నారు లాయిడ్ ఆస్టిన్. రక్షణ రంగంలో భాగస్వామ్యంతో.. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు లాయిడ్. రష్యాతో ప్రధాన ఆయుధ ఒప్పందాలు మానుకోవాలని సూచించారు .