రాష్ట్రపతి భవన్​లో..ఎట్ హోమ్

రాష్ట్రపతి భవన్​లో..ఎట్ హోమ్

రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ‘ఎట్ హోమ్’ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఉపరాష్ట్రపతి జగ్​దీప్ ధన్​ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్​, డిప్లమాట్లు, వివిధ పార్టీల నేతలు, ఇతర గెస్టులు హాజరయ్యారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియా- పాక్ బార్డర్ లోని వాఘా వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సోల్జర్లు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్‌‌ సాధించిన చంద్రయాన్‌‌- 3 విజయం, ఆదిత్య ఎల్​1 మిషన్లపై ఇస్రో రిపబ్లిక్​డే పరేడ్​లో ప్రదర్శించిన శకటం ఆకట్టుకున్నది. చంద్రుడిపై మన విక్రమ్‌‌ ల్యాండర్ దిగుతున్న విజువల్స్,  శివశక్తి పాయింట్‌‌ను శకటంపై ప్రదర్శించారు.

రామ జన్మభూమిలో నిర్మించిన బాలక్ రామ్​ మందిర్ థీమ్​తో ఉత్తరప్రదేశ్​ప్రభుత్వ శకటం రూపొందించింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రతీకగా అధికారులు దీనిని తీర్చిదిద్దారు. 'అయోధ్య : విక్షిత్ భారత్-సమ్రాధ్ విరాసత్' పేరుతో ప్రదర్శించిన ఈ శకటం ఆకట్టుకుంది.