స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం..రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ

స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం..రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ

స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి.ఈ  ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 71 మంది గాయపడ్డారు. కార్డోబా నగరానికి సమీపంలోని ఆడముజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

మాడ్రిడ్ నుంచి హుయోల్వాకు వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి పక్క పట్టాలపై వెళ్తున్న మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టింది. రెండు రైళ్లు వేగంగా ఢీకొనడంతో బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.స్పానిష్ మీడియా ప్రకారం.. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో దాదాపు 450 మంది ప్రయాణికులు ఉన్నారు.  ఈ ఘటనతో మాడ్రిడ్ , అండలూసియా మధ్య అన్ని సర్వీస్ రైళ్లు నిలిపివేశారు.

మాలాగా నుంచి మాడ్రిడ్ కు వెళ్తున్న హైస్పీడ్ రైలు ఆడముజ్ సమీపంలో పట్టాలు తప్పింది.. ఆ ట్రాక్ దాటగానే ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టింది.. ఆ రైలు కూడా పట్టాలు తప్పిందని స్పెయిన్ కు చెందిన ఆదిఫ్ రైలు సంస్థ X లో పోస్ట్ చేసింది. పక్కనే ఉన్న ట్రాక్ పై ప్రయాణిస్తున్న మాడ్రిడ్ నుండి హుయెల్వా రైలు కూడా పట్టాలు తప్పిందని తెలిపింది.