వీడియో: అమెరికాను వణికిస్తోన్న ‘ఐడా’ తుఫాన్

వీడియో: అమెరికాను వణికిస్తోన్న ‘ఐడా’ తుఫాన్

న్యూయార్క్: ఐడా హరికేన్ న్యూయార్క్ ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా అమెరికాలోని ఆరు రాష్ట్రాలు నీట మునిగాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మేరీలాండ్, పెన్సిల్వేనియా, వర్జీనియా రాష్ట్రాల్లో వరదల వల్ల 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. కాలనీలు నదులుగా మారాయి. కార్లు పడవల్లా మారి వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్లాట్ ఫామ్స్, ట్రాక్స్ పైకి భారీగా వరద నీరు చేరడంతో సబ్ వేలను క్లోజ్ చేశారు. రైళ్లు, బస్సులు వరదనీటితో నిండిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. బేస్ మెంట్ ఏరియాలు వరద నీటితో నిండిపోయాయి. వందలాది విమాన రాకపోకలను నిలిపివేశారు. వరదల కారణంగా న్యూ జెర్సీ, న్యూయార్క్, మాన్ హట్టన్ లోని ప్రధాన రోడ్లను మూసివేశారు. న్యూయార్క్ లో బేస్ మెంట్ లో చిక్కుకుపోయి 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. న్యూజెర్సీలో కేవలం ఒక్క గంటలోనే 8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.