జేడీఎస్‌కు షాక్‌.. బీజేపీలోకి సీనియర్ ఎమ్మెల్యే

 జేడీఎస్‌కు షాక్‌.. బీజేపీలోకి సీనియర్ ఎమ్మెల్యే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు జేడీఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ఎ.టి. రామస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అర్కలగుడ్‌ సీటు నుంచి జేడీఎస్‌ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామస్వామి గత కొంత కాలంగా అధిష్ఠానంతో విభేదిస్తూ వస్తున్నారు. మార్చి 31న జేడీఎస్‌కు రాజీనామా చేసిన ఆయన తాజాగా అధికార బీజేపీలో చేరారు. 

https://twitter.com/ANI/status/1642112108128276481

రామస్వామి కంటే ముందు రోజున జేడీఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే  శివలింగ గౌడ రాజీనామా చేశారు. ఈయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.  ఎన్నికల ముగింట సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేస్తుండటం జేడీఎస్‌కు కోలుకోలేని షాకుకు గురిచేస్తున్నాయి. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ఇప్పటికే ప్రకటించింది.  మే 10న ఎన్నికలు జరుగనుండగా.. మే 13న కౌంటింగ్ ఉండనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.